సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు: డిసెంబర్ 22కు అపాయింటెడ్ డే

TG: రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా డిసెంబర్ 20నగా నిర్ణయించిన అపాయింటెడ్ డేను డిసెంబర్ 22కు మార్చుతూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్ 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన కొత్త సర్పంచులందరూ డిసెంబర్ 22న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *